వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తలు పారిపోయారు: యార్లగడ్డ 1 y ago
AP : గతంలో టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని జగన్ ప్రయత్నించినట్లు టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్ రావు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధే లేదని, అందుకే ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారన్నారు. జగన్ ప్రజా సమస్యల కోసం పని చేస్తే రాష్ట్రానికి ఉపయోగమని, పనికిమాలిన విమర్శలు చేయడం వలన ఎవరికీ ఉపయోగం లేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని, బూతులు తిట్టే వారిని మంత్రులుగా చేయడం వలనే వైసీపీ ఓడిపోయిందన్నారు.
వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తలు పారిపోయారని, కానీ కూటమి ప్రభుత్వంలో ముందుకొస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో గన్నవరం నియోజకవర్గంలో హెచ్‌సీఎల్‌లో ఎందుకు ఉద్యోగాలు పడలేదని, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అశోక్ లైల్యాండ్ కంపెనీ ఎందుకు వెనక్కి వెళ్లిపోయిందని ప్రశ్నించారు. 1350 ఎకరాలు ఉన్న మల్లవల్లి పారిశ్రామిక కారిడార్‌లో రూ. 16.5 లక్షలుగా ఉన్న ఎకరాన్ని రూ. 89 లక్షలకు పెంచి అందరినీ బయటకు పంపేశారన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో పవన్ కల్యాణ్‌ను గంట కూడా ఆపలేకపోయారని, అదే విధంగా లోకేష్ లక్ష్యాన్ని కూడా ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.